ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ జెనీలియా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడింది. వివాహం అనంతరం నటిగా జెనీలియా జోరు తగ్గించింది. భర్త, ఇద్దరు పిల్లలకే తన సమయాన్ని కేటాయించింది. అయితే దాదాపు 13 ఏళ్ల గ్యాప్ అనంతరం జెనీలియా తాజాగా `జూనియర్` మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి డెబ్యూ ఫిల్మ్ ఇది. శ్రీలీల హీరోయిన్ కాగా.. జెనీలియా కథలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించింది.

మూడేళ్లుగా భర్త టార్చర్.. జెనీలియా రీఎంట్రీ వెనుక ఏం జరిగింది?
Posted on: 19-07-2025
Categories:
Movies