డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ పితామహుడు, కొరియాకు చెందిన ఖుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్ కొద్ది రోజుల క్రితం ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ఆయన భేటీ అయి చర్చలు జరిపారు. ఏపీలో డీ2ఎమ్ టెక్నాలజీ ఫోన్లు, ట్యాబ్ల తయారీ యూనిట్ పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు. కంపెనీ స్థాపించేందుకు అవసరమైన అనుమతులు, స్థలం, మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని లోకేశ్ హామీనిచ్చారు.