ఆంధ్రప్రదేశ్‌లో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి వరకు ట్రాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దర్శి రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ స్టేషన్ మీదుగా రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి తిరుపతి, చెన్నై వెళ్లడం సులువు అవుతుంది. పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది.