శ్రీవారి

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు.. వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ఎంత టైం పడుతుంది అంటే!

Posted on: 15-07-2025

Categories: Politics

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇకపోతే సోమవారం 74,149మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 29,066మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుంది.

Sponsored