తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ స్థానాలు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. అలాగే గ్రామ పంచాయితీలు, వార్డుల సంఖ్యను కూడా ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, 566 జడ్పీటీసీ స్థానాలు 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా రాష్టంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా, వార్డుల సంఖ్య 1,12,000గా ఉన్నట్టుగా తెలిపింది.