ప‌బ్లిక్

ప‌బ్లిక్ టాక్ : నీరోను మించిన హీరో జ‌గ‌న్‌!

Posted on: 10-07-2025

Categories: Politics | Andhra

వైసీపీ నాయకులకు ఏమాత్రం భయం కానీ ప్రజల పట్ల బాధ్యత కానీ లేకుండా పోతోంద‌న్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రప్ప రప్ప డైలాగులతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రప్పా రప్పా డైలాగులను ఆయన సమర్థించారు. పైగా తప్పు లేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో వైసిపి పై ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇక తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరుసకు వదిన అయ్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే

Sponsored