జపాన్‌లో ఒక మాంగా కళాకారుడు ర్యో తాత్సుకి, 2025 జూలై 5న పెద్ద భూకంపం లేదా విపత్తు వస్తుందని గతంలో వ్రాసిన కథ వల్ల భయాందోళనలు ఏర్పడ్డాయి. దీనివల్ల జపాన్‌లో పర్యాటక బుకింగ్‌లు 20% వరకు పడిపోయాయి. జపాన్ ప్రభుత్వం, శాస్త్రజ్ఞులు దీన్ని కేవలం ఆర్ట్ వర్క్‌గా తీసుకోవాలని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భావించి, పర్యటనలు, రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ జూలై 5 ముందే పెద్ద విపత్తు వస్తుందన్న ప్రచారం ఎక్కువవడంతో, పోలీస్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలు అప్రమత్తం అయ్యాయి.