తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకొని పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన నారా లోకేష్.. తొలినాళ్లలో ఎన్నో అవమానాలు, మరెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముద్దపప్పు అంటూ వైసీపీ దారుణంగా ట్రోల్ చేసిన, 2019 ఎన్నికల్లో మంగళగిరి నిమోజవకర్గంలో ఓటమి పాలైన నారా లోకేష్ మాత్రం వెనకడుగు వేయలేదు. పదేళ్లు తిరిగే సరికి పప్పు అన్న వారి చేతే నిప్పు అనిపించుకున్నారు. ఓడిన చోటే నెగ్గి చూపించారుఈ తరానికి టార్చ్ బేరర్ గా మారారు.