కూటమి ప్రభుత్వం మరో పథకం అమలు చేయబోతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఇతర కారణాల వల్ల అనాథలైన పిల్లలకు 'మిషన్ వాత్సల్య' పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఆర్థిక సాయం అందించనుంది. ఏపీలో ఈ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.4 వేలు ఇస్తారు. అంటే ఏడాదికి రూ.48 వేలు వారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని సరిగా అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.