భారత్, చైనా సంబంధాలలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను తిరిగి జారీ చేయాలని భారత్ నిర్ణయించింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత నిలిపి వేసిన ఈ వీసాల జారీని పునఃప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పర్యాటకం, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత్-చైనా సంబంధాల్లో కీలక ముందడుగు..: చైనీయులకు తిరిగి టూరిస్ట్ వీసాల జారీ
Posted on: 23-07-2025
Categories:
Politics