రామాయణం పారాయణం చేయడానికి మలయాళీలు ప్రత్యేకంగా ఒక నెలను కేటాయించుకున్నారని తెలుసా..? అవును.. కేరళలో కార్కిడకం మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నెల మొదటి రోజు ఏనుగులకు ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి రోజూ రామాయణం చదువుతారు. కార్కిడకం నెలంతా మాంసాహారాన్ని తీసుకోరు. జీలకర్ర, పిప్పలి లాంటి పదార్థాలతో తయారుచేసిన ప్రత్యేక పదార్థాన్ని తీసుకుంటారు. వ్రతాలు, ఉపవాసాలను ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రకృతితో మమేకమై మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు.

ఏనుగులకు ఆహారం పెట్టే పండుగ.. కేరళ ‘శ్రావణ మాసం’ నేర్పే పాఠం ఏంటి?
Posted on: 23-07-2025
Categories:
Politics