రూ.72

రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన అభిమాని... సంజయ్ దత్ ఏం చేశారంటే!

Posted on: 29-07-2025

Categories: Movies

బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ 2018లో తనకు ఎదురైన ఒక బావోద్వేగ సంఘటనను తాజాగా ఇంటర్వ్యూలోవెల్లడించారు. మలబార్ హిల్స్‌లో నివసించే 62 ఏళ్ల నిషా పాటిల్ అనే మహిళ తన మరణానంతరం రూ.72 కోట్ల విలువైన ఆస్తిని సంజయ్ దత్‌ పేర మీద వీలునామా రాశారు. ఆమె మరణానంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వార్త విన్న సంజయ్ దత్ వెంటనే న్యాయవాదులను సంప్రదించి ఆ ఆస్తి‌ను ఆమె కుటుంబానికి తిరిగి అందజేసారు.

Sponsored