ఆంధ్రప్రదేశ్‌కు లులు మాల్స్ రానున్నాయి. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖలో బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌లో 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్ కోసం ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.