మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ఛైర్మన్‌తో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి భోజనం చేశారు. భక్తులు అన్నప్రసాదం రుచిగా ఉందని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం, స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. అప్పలాయగుంటలో ప్రసన్న ఆంజనేయ స్వామికి అభిషేకం, కల్యాణోత్సవం జరుగుతాయి.