బ్యాంక్

బ్యాంక్ ఉద్యోగి నుంచి నటుడిగా.. కోట తీర‌ని క‌ల అదే!

Posted on: 14-07-2025

Categories: Movies

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోట మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆఖరి చూపు కోసం కోట ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. కోట శ్రీనివాసరావు స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ డాక్టర్. 1945 జూలై 10 కోట శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి మాదిరిగానే తాను కూడా డాక్టర్ అవ్వాలని కోట కల కన్నారు. కానీ ఆ కల తీర‌లేదు.

Sponsored