కూకట్‌పల్లిలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. వాణిజ్య అవసరాల కోసం ఉద్దేశించిన ఎకరం స్థలం ఆన్‌లైన్ వేలంలో రూ. 65.34 కోట్లకు అమ్ముడుపోయింది. అదే సమయంలో.. రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా బండ్లగూడలో నిర్వహించిన లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ. 26 కోట్ల ఆదాయం వచ్చింది. బండ్లగూడలో ఫ్లాట్లు దక్కనివారు పోచారంలోని ఫ్లాట్లకు ఆగస్టు 1, 2 తేదీల లాటరీ కోసం అదే రశీదుతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పోచారంలో రూ. 19 లక్షలకే 2 BHK ఫ్లాటు ఇస్తున్నారు.