కొత్త

కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్.. అప్పటి వరకు అదే ఆధారం

Posted on: 30-07-2025

Categories: Politics | Telangana

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 5.61 లక్షల కుటుంబాలకు మంజూరు పత్రాలు జారీ చేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ పంపిణీ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. కొత్త కార్డుల డిజైన్లు ఖరారు కానందున.. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కూడా ఈ మంజూరు పత్రాలు చెల్లుబాటు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Sponsored