ఒకప్పుడు మెగా అభిమానులంటే అంతా ఒక్కటే. ఆ కుటుంబంలోని అందరు హీరోలనూ ఫ్యాన్స్ అభిమానించేవాళ్లు. ఆ హీరోల్లాగే అభిమానులూ కలిసి సాగేవాళ్లు. ఎవరి మీదా వ్యతిరక భావం ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మెగా అభిమానుల్లో వర్గాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరైపోయారు. రకరకాల కారణాలతో మిగతా మెగా అభిమానులకు, బన్నీ ఫ్యాన్స్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చేసింది.