వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్ కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సరెండర్‌కు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మిథున్ రెడ్డి వాదించినప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.