‘కింగ్డమ్’

‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. కొండన్న హిట్టు కొట్టేసినట్లేనా? బక్కోడు డ్యూటీ ఎక్కేశాడా?

Posted on: 31-07-2025

Categories: Movies

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' చిత్రం విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యూఎస్ ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విజయ్ నటన, అనిరుధ్ సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని టాక్ వస్తోంది. అన్నదమ్ముల అనుబంధం, హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రల్లో చక్కగా నటించారని తెలుస్తోంది. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Sponsored