ఏపీలో

ఏపీలో ఆ టీచర్ కుటుంబానికి రూ.1.29 కోట్లు.. 2016లో ఘటన, డిపాజిట్ చేసిన ప్రభుత్వం

Posted on: 30-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి కామరాజ్ కుటుంబానికి భారీ పరిహారం అందనుంది. 2016లో నెల్లూరు జిల్లాలో రోడ్డు పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు కామరాజ్ మృతి చెందారు. కోర్టు ఆదేశాల మేరకు రూ.1.29 కోట్ల పరిహారంలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి న్యాయం చేకూరనుంది.

Sponsored