పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటేనే మరోవైపు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా, కోట్లాది మంది అభిమానులున్నా ఆయనకు కూడా ఇష్టాఇష్టాలు ఉంటాయి కదా. లేటెస్టుగా ఏపీ డిప్యూటీ సీఎం తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరనేది వెల్లడించారు.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.