తెలంగాణ

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు, స్పీకర్‌కు డెడ్‌లైన్

Posted on: 31-07-2025

Categories: Politics | Telangana

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తాజా తీర్పుతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Sponsored