తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ రాసిన లేఖ.. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ ఆత్మతో తన ఆత్మ కలిసిందని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఈ సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే.