ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్మేవారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనికి ఆధారాలు చూపిస్తానన్నారు. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులనే నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో నిరసన తెలిపారు. ఎస్సై గ్యాంగ్ ఏర్పాటు చేసి గంజాయి అమ్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనూ బెల్ట్ షాపుల విషయంలో ఎక్సైజ్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.