వైసీపీ

వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఆగడాలు.. `జై జ‌గ‌న్‌` అన‌లేద‌ని బట్టలు విప్పి..?

Posted on: 16-07-2025

Categories: Politics | Andhra

అధికారం పోయిన వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. `జై జగన్` అనలేదని ఓ బీజేపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు చిత్రహింసలకు గురి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ పెనమలూరులో జై జగన్ అనేందుకు ఓ బీజేపీ కార్యకర్త నిరాకరించాడు. దాంతో అతనిపై బుర్ర వెంకట్‌, గంగాధర్ అనే ఇద్ద‌రు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Sponsored