టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆయనను కొన్ని రోజుల క్రితమే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి డయాలసిస్‌తో ఆరోగ్యాన్ని నిలుపుకునే ప్రయత్నం సాగింది. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చివరికి చికిత్స ఫలించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.