న్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు.. వివాదాలకు కేరాఫ్ అన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడ ఏం చేసినా.. వివాదాలను వెంటబెట్టుకుని అడుగులు వేస్తారు. గతంలోనూ అనేక సార్లు ఆయన వివాదాలలో చిక్కుకున్నారు. అయితే.. పార్టీ ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరించడం.. తర్వాత నాలుగు రోజులు మౌనంగా ఉండడం.. ఆ తర్వాత మళ్లీ మామూలే.. అన్నట్టుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారు. తాజాగా కూడా కొలిక పూడి వివాదానికి దారితీసేలా వ్యవహరించారు. నేరుగా పోలీసు స్టేషన్‌లోనే ఆయన పంచాయతీ పెట్టారు.