కరెంట్

కరెంట్ గురించి టెన్షన్ వద్దు.. ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, కేంద్రం సబ్సిడీ

Posted on: 24-07-2025

Categories: Politics

విద్యుత్ గురించి టెన్షన్ వద్దు. మీ ఇంటి పైకప్పు పైనే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ఇంటికి సరిపడా విద్యుత్‌ను వాడుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు, అవసరానికి ఎక్కువైన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి, ఆదాయం కూడా పొందవచ్చు. సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన విద్యుత్‌ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Sponsored