అన్నదాత సుఖీభవలో పొరపాట్లు తెరపైకి వచ్చాయి. 44 గ్రామాల్లో 476 మంది రైతులకు తండ్రి పేరుగా ‘‘చిన వెంకటసుబ్బరాజు’’ ఉండటంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రకటనతో రైతులకు ఆనందం కలగాల్సిన సమయంలో, ఓ ఘోరమైన నిర్వాహక లోపం వల్ల ఊహించని అసౌకర్యం ఏర్పడింది. మండలంలోని 44 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన 476 మంది పట్టాదారుల తండ్రి పేరు తప్పుగా నమోదు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.