తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 2026 తర్వాత జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతే పునర్విభజన సాధ్యమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో కష్టమని తెలుస్తోంది. ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు నిరాశ కలిగించింది.