రత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. 2022 ఆగస్టులో జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయినప్పటికీ జగదీప్ చాలా ముందే పదవి నుంచి వైదొలిగారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జగదీప్ లేఖలో పేర్కొనడం.. రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడం జరిగిపోయాయి