గత కొంత కాలం నుంచి హిట్ కోసం పరితపిస్తున్న యూత్ స్టార్ నితిన్.. తాజాగా `తమ్ముడు` అంటూ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ కాగా.. లయ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, సౌరబ్ సచదేవ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన తమ్ముడు మూవీ జూలై 4న భారీ అంచనాలు నడుమ విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అందుకు తగ్గట్టే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపు లేకపోయింది.