ఇలాంటి తరుణంలో వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ యొక్క సర్ప్రైజింగ్ ఎంట్రీ ఉంటుందట. శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నాడని ప్రముఖ యూట్యూబర్ `నా అన్వేషణ` అన్వేష్ వెల్లడించాడు.ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న అన్వేష్.. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ చేస్తున్నట్టు తెలిపాడు. సినిమా సూపర్ గా ఉందని.. థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయమని అన్వేష్ తెలిపాడు.