రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న #SSMB29 షూటింగ్ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే క్రియేటివ్ డిఫరెన్సులతోనే, మరేదో కారణంతోనే ఈ మూవీ షూటింగ్ ఆగలేదు. దానికి వేరే కారణం ఉంది. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న SSMB29 మూవీ షూట్ కోసం కెన్యా వెళ్లాలని అనుకుంది చిత్ర యూనిట్. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.కెన్యా ఫైనాన్స్ బిల్లుకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో కెన్యాలో జరగాల్సిన షెడ్యూల్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది SSMB29 చిత్ర యూనిట్.

షూటింగ్ ఆగిపోయిందా? ఆందోళనలో మహేశ్ ఫ్యాన్స్! ప్రత్యామ్నాయం వెతుకుతున్న రాజమౌళి...
Posted on: 17-07-2025
Categories:
Movies