ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 (Andhra Premier League 2025)కు సంబంధించి సోమవారం రోజున విశాఖపట్నం కేంద్రంగా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆల్ రౌండర్లను దక్కించుకొనేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆటగాళ్ల వేలంలో పాల్గొన్న మొత్తం ఏడు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఈ వేలానికి ముందే ఏడు జట్లు మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. భారత క్రికెటర్ హనుమ విహారిని అమరావతి రాయల్స్ రూ. 10 లక్షలకు రిటైన్ చేసుకుంది.

ఏపీఎల్‌లో హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డిలు ఎంత ధర పలికారు?... అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరంటే...
Posted on: 17-07-2025
Categories:
Sports