రప్పా

రప్పా రప్పా ఏంట్రా.. చిక‌ట్లోనే మొత్తం అయిపోవాలి: పేర్ని నాని

Posted on: 14-07-2025

Categories: Politics | Andhra

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్ధేశించిన‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈమధ్య పుష్ప సినిమాలోని `రప్పా రప్పా నరికేస్తాం` డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో ఎంతటి హాట్‌ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ శ్రేణులు ఈ డైలాగ్ ను తెగ వాడేస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా పెడుతున్నారు. అయితే ఈ అంశంపై నేడు కృష్ణ జిల్లా పామ‌ర్రులో జ‌రిగిన స‌మావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Sponsored