డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిలక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. ఎంపికైన మహిళలకు శిక్షణ ఇచ్చి, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రుణం అందజేస్తారు. ఈ పథకం ద్వారా నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఆదాయం పొందవచ్చు.