అమెరికాలోని

అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ...

Posted on: 17-07-2025

Categories: NRI

అమెరికాలోని అలస్కా తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేసినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం స్థానిక సమయం 12:37 గంటలకు సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రం సాండ్ పాయింట్ ద్వీప పట్టణానికి దక్షిణంగా 54 మైళ్లు (87 కిలోమీటర్లు) దూరంలో ఉందని తెలిపింది. 20.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించామని పేర్కొంది.

Sponsored