10

10 ఏళ్ల మెడికల్ మిస్టరీ.. డాక్ట‌ర్లు చేతులెత్తేసిన చాట్ జీపీటీ ఛేదించింది!

Posted on: 14-07-2025

Categories: NRI

ఇటీవ‌ల కాలంలో చాట్ జీపీటీ వినియోగం ఎంత‌లా పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇది వివిధ రంగాల్లో ఉపయోగపడే ఒక శక్తివంతమైన మల్టీటాస్కింగ్ టూల్ గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి పరిష్కరించలేని ఎన్నో సమస్యలను చాట్ జీపీటీ సాల్వ్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా 10 ఏళ్ల మెడిక‌ల్ మిస్ట‌రీని చేధించి మ‌రోసారి చాట్ జీపీటీ త‌న స‌త్తా ఏంటో నిరూపించ‌కుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ప‌దేళ్ల నుంచి ఓ వ్య‌క్తి రోగ‌మేంటో గుర్తించ‌లేక‌ డాక్ట‌ర్లే చేతులెత్తేస్తే.. చాట్ జీపీటీ మాత్రం చిటికెలో అత‌ని స‌మ‌స్యేంటో గుర్తించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Sponsored