వైసీపీ హయాంలో అక్రమాలకు, అడ్డగోలు దోపిడీకి పాల్పడిన నేతలు ఇప్పుడు కేసులు అరెస్టులు కోర్టు అంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి వంతు వచ్చింది. తాజాగా ఏపీ సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ యజమాని కేవీ రావు ను బెదిరించి అక్రమంగా రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను తీసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డిపై కేసు నమోదు అయింది.

ఇక విజయసాయి రెడ్డి వంతు.. సీఐడీ నోటీసులు!