Headline Image
స‌మంత‌ తో విడాకుల‌పై చైతూ ఘాటు వ్యాఖ్య‌లు!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మొద‌టి వివాహ బంధం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌ తో సుమారు ఏడేళ్లు ప్రేమాయ‌ణం న‌డిపిన నాగ‌చైత‌న్య‌.. 2017లో పెద్ద‌ల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే అనుకున్నంత సాఫీగా వీరి వైవాహిక జీవితం సాగ‌లేదు. 2021లో నాగ‌చైత‌న్య‌, సమంత విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి స‌మంత ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతుండ‌గా.. చైతూ శోభిత ధూళిపాళ్ల‌ను రెండో వివాహం చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు.