Headline Image
అందుకే జట్టులో ఐదుగురు స్పిన్నర్లు: రోహిత్ శర్మ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌లో బరిలోకి దిగే భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకంటూ వచ్చిన విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. అసలు జట్టులో ఉన్నది ఇద్దరు స్పిన్నర్లు మాత్రమేనని, మరో ముగ్గురు ఆల్‌రౌండర్లని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ డెప్త్ కోసమే వారిని ఎంపిక చేశామని, ఆరుగురు పేసర్లను తీసుకున్న జట్లను ఎందుకు ఇలా విమర్శించరని అసహనం వ్యక్తం చేశాడు.