మదగజరాజా.. తమిళంలో సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఈ మ ూవీ అంత పెద్ద సక్సెస్ కావడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనం. మామూలుగా చూస్తే విశాల్ సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. 2023లో వచ్చిన అతడి చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ వంద కోట్ల మైలురాయిని కూడా అందుకుంది. ఐతే ‘మదగజరాజా’ను దీంతో పోల్చి చూడలేం. ఎప్పుడో 2011లో మొదలై.. 2013లో విడుదలకు సిద్ధమైన సినిమా ఇది.

బ్లాక్‌బస్టర్ మూవీని మనోళ్లు పట్టించుకోలా..!