Headline Image
తండేల్.. ఇది గొప్ప ఘనతే

సంక్రాంతి సందడి తర్వాత మధ్యలో కొంచెం డల్ అయిన బాక్సాఫీస్‌కు ఇప్పుడు మళ్లీ కళ వచ్చింది. ఈ శుక్రవారం రిలీజైన ‘తండేల్’ సినిమా థియేటర్లను కళకళలాడిస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు మరీ గొప్ప టాకేమీ రాలేదు. టీం చెప్పినంత గొప్పగా లేదు కానీ.. వాచబుల్ మూవీ అనే టాక్ వచ్చింది. ఆ టాక్‌తోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది తొలి రోజు రూ.20 కోట్ల గ్రాస్, రూ.12 కోట్ల షేర్‌తో నాగచైతన్య కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు