Headline Image
తెలంగాణ కాంగ్రెస్ సెల్ప్ గోల్‌…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తన పరువు తానే తీసుకోవటం మ‌హా స‌ర‌దాగా అనిపిస్తోంది. ఇందుకు తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం అని చెప్పాలి. అస‌లు ఇప్పుడు ఏం అవ‌స‌రం వ‌చ్చింద‌ని ఓ పోల్ పెట్టారో కాని.. ఆ పోల్ కాంగ్రెస్ ప‌రువు తీసేసింది. ముందునుంచి కూగా కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాలో చాలా వీక్‌గా ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ విష‌యం మ‌రోసారి పార్టీ అధికారంలో ఉండి కూడా నిజం అని ఫ్రూవ్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియ‌ల్‌గా ఓ పోల్ పెట్టింది.