Headline Image
హైకోర్టుకే టోక‌రా వేసిన బోరుగడ్డ.. ఎంత మోసం?

వైకాపా నాయకుడు, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టుకే టోక‌రా వేశాడు. తల్లికి అనారోగ్యం అంటూ త‌ప్పుడు మెడిక‌ల్‌ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి బోరుగ‌డ్డ బెయిల్ తెచ్చుకున్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రియు వారి కుటుంబ స‌భ్యుల‌పై అసభ్య దూషణలు చేసిన కేసులో బోరుగ‌డ్డ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.