Headline Image
ఓటీటీలోకి `డాకు మహారాజ్`.. ఈ వారంలోనే స్ట్రీమింగ్!

ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ వార‌మే డాకు మ‌హారాజ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి బాల‌య్య న‌టించిన డాకు మ‌హారాజ్ ను త‌మ ఫ్లాట్‌ఫామ్ లో వీక్షించ‌వ‌చ్చు అంటూ నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక‌పోతే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన డాకు మ‌హారాజ్ చిత్రంలో బాల‌య్య‌కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ న‌టించింది.