Headline Image
జీవి రెడ్డి ఎపిసోడ్ –ఆలోచించండి!

తక్కువ సమయంలో పార్టీలో ఉన్నత స్ధాయికి ఎదిగిన యువకుడు. పార్టీ నాయకత్వం పూర్తి గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కూడా విషయజ్ఞానం వాక్పటిమ కలిగి అప్పటి ప్రభుత్వ ఆర్ధిక అరాచకం ప్రజలకు సమర్ధవంతంగా వివరించారు. పార్టీ అగ్రనాయకత్వానికి మరింత చేరువయ్యారు. ముఖ్యసమావేశాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అధిష్ఠానం తో నేరుగా సత్సంబంధాలు ఏర్పడ్డాయి అనే కంటే వారు దగ్గర తీసుకున్నారని చెప్పవచ్చు.