Headline Image
జగన్ కు ‘గుంటూరు కారం’ ఘాటు..కేసు

చట్టాలను అతిక్రమించకుండా..నియమ నిబంధనలు పాటిస్తూ..సామాన్య ప్రజలకు రోల్ మోడల్ గా సీఎం ఉంటారు అని భావిస్తుంటారు. అయితే, ఏపీకి నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ సీఎం తానే అని ఫీలయ్యే జగన్ మాత్రం ప్రజలకు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తున్నారు. ఈసీ, పోలీసులు వద్దంటున్నా వినకుండా నిబంధనలను తుంగలో తొక్కి మరీ గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు జగన్. ఈ క్రమంలోనే జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.